మొక్కలు బాగా ఎదగాలంటే ఎరువులు వేయాలి. సాధారణంగా బయట మార్కెట్ లో రసాయనిక ఎరువులు మాత్రమే దొరుకుతాయి. ఇంటి గార్డెన్ లో వేసే ఎరువులు ఆర్గానిక్ ఎరువు(సేంద్రియ ఎరువు)లైతే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఆర్గానిక్ ఎరువులు ఏ రకంగా చేస్తారనేది పరిశీలిద్దాం.
సాధారణంగా పశువుల కొట్టంలో దొరికే దేశివాలి ఆవుపేడ, మూత్రమును వారానికొక్కసారి కలియబెడుతూ 45 రోజుల పాటు కుళ్ళపెడతాము, దానినే మేము ఘన జీవామృతం అని కూడా అంటాము.
ఉచిత సలహా - ఉపయోగించిన గుడ్డుపై భాగాలు కూడా మొక్కలకు మంచి ఎరువుగా వాడవచ్చు. వీటిలో పొటాషియం మరియు కాల్షియం అధికం. ఎగ్ షెల్ ను ఎండబెట్టి నీటితో కలిపి ఎరువుగా వేయవచ్చు. ఈ రకమైన సేంద్రీయ ఎరువులు మీ గార్డెన్ మొక్కలను బాగా పెరిగేలా చేస్తాయి