దేశవాళీ ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి ఎంతో శ్రేష్ఠమైనవని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అంతేకాదు ఆవు మూత్రంలో కూడా ఔషధ గుణాలున్నాయని కూడా తెలుసు. అయితే స్వచ్ఛమైన దేశవాళి ఆవు నెయ్యి ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరం.
ఒంగోల్, గిర్, సాహివాల్ మరియు కపిల ఆవు వంటి స్వచ్చమైన భారతీయ ఆవు జాతుల పాల పెరుగు నుంచి తీసిన నెయ్యి మాత్రమే వాడవలెను. ఈ ఆవుల నుండి వచ్చే పాలు A2 ప్రోటీన్ కలిగి ఉంటుంది. స్థానిక భారతీయ ఆవులు పాలు కొంచెం తక్కువగా ఇచ్చినప్పటకీ, అరుర్వేదాలలో అసంఖ్యాక ఆరోగ్య ప్రయోజనాల వలన బంగారం లాంటిది. ఈ నెయ్యి ఎంతో విలువైనది.